
సమంత అక్కినేనికి వ్యాయామం, ఫిట్నెస్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. 2010లో మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ నుంచి ఇప్పటికి వరకూ అంతే అందంగా ఉంది అంటే కారణం తాను రోజు జిమ్ చేయడమే అని సమంత భావిస్తుంది. ఇక ఇప్పుడు సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో జిమ్ చేస్తూ ఒక ఫోటోని పోస్ట్ చేసింది. అటు ఇటు 10 కేజీల బరువులని వేసుకొని సమంత వాటిని లేపుతూ ఫోటో పెట్టారు. ఈ ఫోటోని చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. జిమ్ లో దిగిన ఈ ఫోటోకి ప్రముఖ సింగర్ చిన్మయి, హీరోయిన్ రుహాని శర్మ గ్రేట్ అని కామెంట్ కూడా పెట్టారు. ఇక సమంత ప్రస్తుతం ఆహాలో ప్రచారమవుతున్న ‘సామ్-జామ్’ షో హోస్ట్ గా ఆదరకొడుతున్న సంగంతి అందరికీ తెలిసిందే అది కాకుండా ఫామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో కూడా సమంత నటిస్తుంది. ఈ సిరీస్ లో సమంత విలన్ గా నటిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో త్వరలో రాబోయే ఈ వెబ్ సిరీస్ తో సమంత విలన్ గా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.