
అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందుతోన్న చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇటీవలే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈరోజు నాగ చైతన్య తన పుట్టిన రోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. నాగ చైతన్య, సమంతతో కలిసి ప్రస్తుతం హాలిడేలను ఎంజాయ్ చేస్తోంది. ఇద్దరూ మాల్దీవ్స్ లో తమ సమయాన్ని గడుపుతున్నారు. సమంత సోషల్ మీడియాలో మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను పోస్ట్ చేస్తోంది. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా సమంత తాజాగా చేసిన పోస్ట్ ఆకట్టుకునేలా ఉంది. "ఎప్పుడూ జీవితాన్ని నీకు నచ్చినట్లే గడుపుతావు. ఎప్పుడూ నీకు సంతోషం కలగాలని కోరుకుంటున్నాను" అని పోస్ట్ చేసింది. నాగ చైతన్య మాల్దీవ్స్ నుండి వచ్చాక తన తర్వాతి సినిమాను మొదలుపెట్టాల్సి ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. సమంత ప్రస్తుతం సామ్ జామ్ అనే షో ను హోస్ట్ చేస్తున్న సంగతి తెల్సిందే.
Always living life on your own terms @chay_akkineni 😍
— Samantha Akkineni (@Samanthaprabhu2) November 23, 2020
Wishing you only happiness always and forever #LoveStory#HBDNagaChaitanya pic.twitter.com/9FCmunhJWT