ఫన్నీ వీడియోతో హల్ చల్ చేస్తున్న సమంత

తన కెరీర్ మొదటి నుంచి సమంత తన డ్రెస్సింగ్ స్టైల్ మీద చాలా దృష్టి పెట్టింది అని ఆమె సినిమాలని చూసి చెప్పొచ్చు. సినిమాల్లోనే కాదు బైట కూడా తన డ్రెస్సింగ్ తో అందరి మతులను పొగుడుతుంది. ఇక సమంత తన క్రేజ్ తెలుసుకొని సాకి వరల్డ్ అనే ఫ్యాషన్ కంపెనీని మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా సమంత ఒక ఫన్నీ వీడియో పోస్ట్ చేసారు. 2020 లో ప్రతి అమ్మాయి వేసుకోవాలి అనుకున్న డ్రెస్ లని చూపిస్తూ సమంత వీడియో చేసింది. ఇందులో సమంత అన్ని రకాల డ్రెస్ లని చూపిస్తూ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఇక సమంతని స్టైల్ గా ఫోటోగ్రాఫర్ ఈషన్ చిత్రీకరించారు. ఇక సమంతని అందంగా జుకల్కిర్ తయారుచేశారు. ఇక సమంత తన సొంత కంపెనీ సాకి వరల్డ్ చూసుకుంటూ ఆహా ఓటీటీలో వస్తున్న సామ్ జమ్ షో తో సందడి చేస్తున్నారు. ఈ షో ఈ మధ్యనే మొదలవ్వగా, మొదటి అతిధిగా విజయ్ దేవరకొండని ఆహ్వానించారు. ఇంకా త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ షోలో అడుగుపెట్టబోతున్నారు. అలాగే ఈ మద్యనే విజయ్ సేతుపతి,  నయనతారతో కలిసి ఒక సినిమాలో సమంత నటించబోతుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.