
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య ప్రస్తుతం మాల్దీవ్స్ పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. ఈ క్యూట్ కపుల్ సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగ్స్, ఈవెంట్స్ తో బిజీగా ఉండే ఈ జంటకు కొంత విరామ సమయం దొరకడంతో జాలీగా మాల్దీవ్స్ కి వెళ్ళారు. అందమైన సాగర తీరంలో ఏకాంతంగా గడుపుతూ లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు. వీరిద్దరు ఈ పర్యటన తర్వాత వాళ్ళ షూటింగ్స్ తో బీజీ షెడ్యుల్ లో పాల్గొననున్నారు. ఎప్పటికప్పుడు సమంత తమ మాల్దీవ్స్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. తాజాగా సమంత అక్కినేని క్యూట్ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో అందమైన స్మైల్ ఇస్తూ రౌండ్ క్యాప్ పెట్టుకుని సైకిల్ పట్టుకుని ఉంది. ఫుల్ రిలాక్స్ మూడ్ లో ఉన్న సమంత ఫోటో మాల్దీవుల్లో ఆమె ఎంత జాయ్ గా ఉందో చెప్తుంది. సమంత ఈ ఫోటో షేర్ చేస్తూ కొబ్బరి చెట్టు, హ్యాపీ, ఫిష్, వాటర్ ఎమోజీ స్ తో తన మల్దీవులు పర్యటనలో తన ఆనందాన్ని చెప్పకనే చెప్పుకొచ్చింది. ఎదీ ఏమైనా ఈ ఫోటోలో సమంత తన క్యూట్ నెస్ తో ముచ్చటగా వుంది. ఈ ఫోటో కి తోటీ హిరోయున్స్ కూడా క్యూటీ అని కామెంట్స్ పెడుతున్నారు.