ఫిదా సినిమాతో ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైన కేరళ బ్యూటీ సాయి పల్లవి. ఆమె నటనలో ఎంతగా రాటు దేలిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్న సాయి పల్లవి జూమ్ యూట్యూబ్ ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన గురించి తెలియని చాలా విషయాలని పంచుకుంది. అసలు తన కెరియర్ ఎలా మొదలైంది, అందులోని విజయాలు, అపజయాలు, తన మొదటి సినిమా గురించి ఇలా చాలా విషయాలు సాయి పల్లవి చెప్పారు. తన ముఖం మీద వచ్చిన మొటిమల వల్ల ఆమె ఎంత బాధ పడ్డారో కూడా సాయి పల్లవి ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. ‘పావ కథైగల్’ అనే సినిమాలో ప్రకాష్ రాజ్ కుతురిగా నటించిన సాయి పల్లవి ఆ సినిమా గురించి చాల విషయాలు పంచుకుంది. తండ్రిగా ప్రకాశ్ రాజ్ అలా సెట్లో నడుచుకుంటూ వస్తే చాలా భయం వేసేది. ప్రకాష్ రాజ్ మాట్లాడినప్పుడు ఆయన గాంభీర్యం చూసి చాలా భయపడేదాన్ని. దాదాపు సెట్లో ఆయన సినిమాకు సంబంధించిన క్యారెక్టర్లోనే ఉండేవారు అంటూ సాయి పల్లవి పాజిటివ్ గా వివరణ ఇచ్చింది. దర్శకులు గౌతమ్ మేనన్, వెట్రి మారన్, సుధా కొంగర, విఘ్నేశ్ శివన్ వంటి టాలెంటెడ్ దర్శకులు నాలుగు కథలతో రూపొందించిన ఈ వెబ్ సినిమాలో సిమ్రన్, అంజలి, జయరాం, కల్కి కొచ్లిన్, గౌతమ్ మేనన్ తదితర పాత్రల్లో కనిపించనున్నారు.