

పెళ్ళి చూపులు సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రీతూ వర్మ, తమిళ, మలయాళ భాషల నుంచి మంచి అవకాశాలు అందుకుంటోంది. తాజాగా తెలుగు నుంచి కూడా రీతూకు ఓ మంచి ఆఫర్ వచ్చింది. తెలుగులో కొంత గ్యాప్ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంది. మాస్ మహారాజ్ రవితేజ సరసన రీతూ హీరోయిన్గా కనిపించబోతోంది. దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రవితేజ ప్రస్తుతం చేస్తున్న ‘క్రాక్’ పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం. అలాగే రీతూ వర్మ టక్ జగదీశ్ సినిమాలో నానీ సరసన, నిన్నిలా నిన్నిలా సినిమా లో, వరుడు కావలెను సినిమా లో నాగశౌర్య పక్కన అలాగే శర్వనంద్ తో కూడా సినిమా చేస్తూ ఉంది. తాజాగా రీతూ వర్మ తన ఇన్స్టాగ్రామ్ లో అదిరిపోయో లుక్ తో ఉన్న ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో రీతూ వర్మ లైట్ పింక్ డ్రెస్స్ లో తన స్టైలిష్ మోడ్రన్ ఇయర్ టాప్స్ చూపిస్తూ లుస్ హేర్స్ తో గ్లామర్ డాల్ గా ఉంది. తను షేర్ చేసిన ఈ ఫోటోకి అభిమానులు ఫిధా అయిపోయారు. ఎప్పుడూ క్యూట్ స్టైల్ తో ఉండే రీతూ వర్మ తన స్టన్నింగ్ లుక్ తో అదరగట్టింది.ఈ ఫోటోకి విపరీతమైన లైకులు వస్తున్నాయి.