తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళి చూపులు’ సినిమాతో హీరోయిన్ గా రీతూ వర్మ వెండితెరకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్నఈ భామ, ఆ తర్వాత చాలా సెలెక్టివ్ గా పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తో కలిసి కూడా నటిస్తుంది. ఆ తర్వాత మలయాళం, తమిళ్ బాషలలో సినిమాలు చేస్తూ అక్కడ మంచి పేరు సంపాదించుకుంది. అయితే రీతూ వర్మ తన సోషల్ మీడియాలో ఒక అందమైన ఫోటోని పోస్ట్ చేసింది. తన ఫోటో ని జె.ఎఫ్.డెబ్ల్యూ డిజిటల్ డిసెంబర్ మ్యాగజైన్ మీద ప్రచురించినదుకు ఆమె వారికి కృతఙ్ఞతలు తెలియజేసింది. అలాగే రీతూ వర్మని ఇంత అందంగా కళ్యాణ్ యశ్వసి ఫోటో తీశారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది రీతూ. ఇప్పటికే నేచురల్ స్టార్ నానితో హీరోగా వస్తున్న టక్ జగదీష్ లో నటిస్తుంది. అలాగే యంగ్ హీరో శర్వానంద్ తాజా చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. అయితే తాజాగా రవితేజ – రమేష్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న ఓ సినిమాలో రీతూ వర్మనే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే నాగ శౌర్య తో కలిసి కొత్త సినిమాలో కూడా రీతూ వర్మ నటిస్తున్నారు