రితికా సింగ్ క్యూట్ అండ్ ఎనర్జిటిక్ హిరోయిన్. రితికా సింగ్ 2016, 2017 సంవత్సరాలలో
తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో మారు మోగిన పేరు. ప్రొఫేషనల్ బాక్సర్ అయిన ఆమెను దర్శకురాలు
సుధా కొంగర రీతికా సింగ్ ని హిరోయిన్ గా మార్చేసింది. సాలా ఖడ్డూస్ సినిమాలో మధవన్ తో రితికా
సింగ్ కలిసి నటించింది. ఈ సినిమాకి సుధ కొంగరా దర్శకత్వం వహించింది. ఇదే సినిమా తెలుగులో
‘గురు’ పేరుతో వెంకటేష్ హిరోగా రీమేక్ చేసారు. ఈ సినిమాలో రితికా సింగ్ యాక్టింగ్, డాన్స్, ఎనర్జీకి
అందరూ ఫిదా అయిపోయారు. రితికా సింగ్ ఈ సినిమాతో మాస్ ఫాలోయింగ్ పెరిగింది. అలాగే తన
క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అబ్బాయిల క్రష్ గా మారింది. తర్వాత లారెన్స్ కి జోడిగా శివ లింగ చిత్రంలో
నటించింది. ఈ భామ ఇన్స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ప్రతి విషయం షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈ భామ సరదాగా బయటికి సైక్లింగ్ కి వెళ్ళింది. వాటికి సంబంధించి ఫోటోలు, వీడియోలు
షేర్ చేసింది. ఈ వీడియోలో రితీకా సైక్లింగ్ కాస్ట్యూమ్స్ లో హెల్మెట్ పెట్టుకుని భల్లే భల్లే అంటూ డాన్స్
చేసింది. అలాగే సైక్లింగ్ చెయ్యడం చాలా ఉల్లాసంగా ఉందని చెప్పుకొచ్చింది