ఆద్య తో టైమ్ స్పెండ్ చేస్తున్న రేణుదేశాయ్

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రీ’ సినిమాతో తెలుగులోకి పరిచయం అయిన రేణు దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పెళ్ళి తర్వాత సినిమాలకి స్వస్తి చెప్పింది. ఇక పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత కొన్ని సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్రవేసింది రేణూ దేశాయ్. ఇక పవన్‌తో విడిపోయిన తర్వాత పిల్లలతో కలిసి పూణెలో నివాసం ఉంటోంది. బాధ్యత గల తల్లిగా జీవనాన్ని కొనసాగిస్తున్న రేణు దేశాయ్. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి పోకుండా చాలా సింపుల్ గా జీవనం సాగిస్తున్నారు. ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తన ఫ్యామిలీకి సంబందించిన ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రేణు తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఫోటో ఒకటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకుంది. ఈ ఫొటోలో రేణు దేశాయ్, ఆద్య ఇద్దరు మాస్క్ లు ధరించి సెల్ఫీ దిగారు. ఇక చాలాకాలం తర్వాత రేణుదేశాయ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘ఆద్య’ పేరుతో తెరకెక్కబోయే లేడీ ఓరియెంటెడ్ ప్యాన్ ఇండియా సినిమాలో ఆమె ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. డీఎస్కే స్క్రీన్, సాయికృష్ణ పొడక్షన్ బ్యానర్లపై రావ్ డి.ఎస్, ఎస్.రజనీకాంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంతో ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.