'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది రెజినా కాసాండ్రా. ఆ తర్వాత వచ్చిన 'రోటీన్ లవ్ స్టోరీ' సినిమాతో మంచి హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలా మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో పిల్లా నువ్వే లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక రెజినా తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు రెజినా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా శారీలో దిగిన ఫొటోస్ ని పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ లో రెజినా చాలా అందంగా కనిపించారు. ఈ శారీని శైలేష్ సింగరియా డిజైన్ చేశారు. అలాగే ఆమె జ్యూవెలరీని ది అమెతిస్ట్ స్టోర్ వారు తయారుచేశారు. డేనియల్ చింత రెజినాని అందంగా ఫోటోస్ తీశారు. ఇక ఇటీవల ‘ఎవరు’ సినిమాలో రెజీనా నెగిటివ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటనకు గాను రెజీనా విమర్శకుల ప్రశంసలు అందకున్నారు. ఇప్పుడు విశాల్ ‘చక్ర’ సినిమాలో కూడా రెజీనా పాత్ర అలాంటి పాత్రనే చేయబోతోంది. మనోబాల, రోబో శంకర్, కె.ఆర్ విజయ్, సృష్టి డాంగే ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. అలాగే రెజినా జయం రవి హీరోగా కూడా ఒక సినిమాలో నటిస్తుంది.