సర్ఫింగ్ ని ఎంజాయ్ చేస్తున్న రెజీన

హిరోయిన్ రెజీనా కసాండ్రా  తెలుగు సినిమాల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ. తన టాలెంట్ తో సినిమాలు చేస్తున్న రెజీనా కసాండ్రా డిసెంబర్ 13న 30వ పుట్టినరోజు జరుపుకుంది. పదిహేనేళ్ల క్రితం అంటే తన పదిహేనేళ్ల వయసులోనే తమిళ చిత్రం 'కంద నాళ్ ముదల్‌'తో నటిగా పరిచయమైన ఆమె, టాలీవుడ్‌కు పరిచయం కావడానికి ఏడేళ్ల సమయం తీసుకుంది. 2012లో సుధీర్‌బాబు జోడీగా 'శివ మనసులో శ్రుతి' మూవీలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రెజీనా. 2014లో అల్లు శిరీష్ జోడీగా చేసిన 'కొత్త జంట', రవితేజతో చేసిన 'పవర్', సాయిధరమ్ తేజ్ సరసన నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ఇటీవలే  రెజీన కాన్సర్ పేషేంట్స్ సాహాయం కోసం హిమలయల్లో వైల్డ్ వారియర్ హిమాలయన్ అడ్వెంచర్ పోటీల్లో పాల్గొని విన్నర్ గా నిలిచింది. కాన్సర్ పేషెంట్స్ కోసం తన తపన చూసిన వారందరు రెజినా చెసిన పనికి మెచ్చుకున్నారు. తాజాగా రెజీనా తన ఇన్స్టాగ్రామ్ సింగిల్ గా వాటర్ బోటింగ్  చేస్తున్న విడీయో పోస్ట్ చేసింది. ఈ వాటర్ ఎక్కడో కాదు చెన్నై లోని చెట్‌పట్కో పార్క్ లోని చిన్న వాటర్ పాండ్ లో. ఈ పార్క్ డెవలప్‌మెంట్ అవ్వకముందు నుండి కూడ ఇంతే అందగా ఐస్ లాండ్ లా వుంది. నాకు చిన్నప్పటి నుండి ఉన్న కోరిక ఇప్పుడు ఇలా తీరింది అని రెజీనా చెప్పుకొచ్చింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.