‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. అయితే ఈ పెళ్ళి సీసన్ లో జరిగిన తన ఫ్యామిలీ ఫంక్షన్ ఫొటోస్ ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మేము మా ఫ్యామిలీతో కలిసి పెళ్ళిలోకి మంచి ఎంట్రీ ఇచ్చామని ఆమె పెళ్ళి లో డాన్స్ వేస్తూ ఒక వీడియోని అలాగే పెళ్ళిలో పెళ్ళికూతుర్ని తీసుకొని వచ్చే ఫొటోస్ ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ ఫొటోస్ లో రాశి పెళ్ళి డ్రెస్ లో అందంగా కనిపిస్తుంది. అయితే తెలుగులో వరసగా సినిమాలు చేసే రాశి ఇప్పుడు తెలుగుకు కొంచెం గాప్ ఇచ్చి తమిళ్ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. రాశి ఖన్నా ప్రస్తుతం మూడు తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఈ మధ్యనే విజయ్ సేతుపతికి జంటగా కొత్త సినిమాకు సైన్ చేసింది. తెలుగులో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న రాశి తమిళ్ లో కూడా ఇలానే స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి. ఆమె తెలుగులో చివరి చిత్రం విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా. ఈ సినిమా అంతా మంచి ఫలితం ఇవ్వకపోయినా తన నటనకి మాత్రం మంచి పేరు వచ్చింది.