
‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన రష్మిక మండన్న, విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇక అలాగే టాలీవుడ్ లో అగ్ర హీరోలతో నటిస్తూ అలాగే వరస సినిమాలతో దూసుకొని పోతుంది. అయితే రష్మిక ఒక క్యూట్ ఫొటోని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన చిన్న పిల్లి పిల్లని పట్టుకొని రష్మిక ఫోటోకి ఫోజు ఇచ్చింది. పిల్లికి యజమానులు ఉండరు అందరి పిల్లి యజమానులకి తెలుసు అని ఈ ఫోటోకి కాప్షన్ పెట్టారు. ఈ ఫోటోలో రష్మిక చాలా అందంగా కనిపించారు. ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో అందరినీ ఆకర్షిస్తుంది. ఇప్పటికే ఈ ఫోటోకి దాదాపుగా 16 లక్షల లైక్స్ వచ్చాయి. ఇక రష్మిక తాజాగా శర్వానంద్ హీరోగా నటిస్తోన్న 'ఆడవాళ్లు మీకు జోహర్లు' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే తిరుమలలో ఈ సినిమా ముహూర్తం జరిగింది. అలాగే రష్మిక, బన్ని కలిసి నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ కూడా శర వేగంగా నడుస్తుంది. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పున: ప్రారంభమైంది. పుష్ప లో అల్లు అర్జున్ కొత్త లుక్ లో కనిపించబోతున్నారు.