టాప్ గేర్ లో ఉన్న రష్మిక... ఏకంగా బిగ్.బి పక్కనే నటిస్తోంది


కిర్రిక్ పార్టి సినిమాతో 2016లో తెరంగేట్రం చేసింది రష్మిక. ఛలో సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ బ్యూటి. ఆ ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ హీరోలతో నటించే అవకాశాల్ని దక్కించుకుంది. ఛలో సినిమా హిట్ తో వెనువెంటనే అవకాశాలు ఆమెకు వచ్చాయి. గీతా గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాల్లో నటించి చాలా తక్కువ కాలంలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఆ వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ఆయన పక్కన నటించే అవకాశాన్ని అందుకుంది.


ఎలాంటి పాత్రనైనా అలవోకగా నటించగల ఆమె తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి హిట్స్ తో ఆమె రేంజ్ పెరిగిపోయింది. కేవలం తెలుగు కన్నడ పరిశ్రమలకే పరిమితమైన ఆమె ఇతర భాషల్లో కూడా పాపులర్ అయ్యింది. ఇటీవలే కార్తి సినిమా సుల్తాన్ తో కోలివుడ్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది.


కేవలం దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా ఆమె పాపులర్ అయ్యింది. ఇటీవలే ఆమె నటించిన టాప్ టక్కర్ పాట యూట్యూబ్ లో 6.6 కోట్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. బాలివుడ్ వర్థమాన నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మంజు సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకుంది. అలాగే బాలివుడ్ బిగ్.బి అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని కూడా రష్మిక అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ప్రీ- ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయని త్వరలోనే షూటింగ్ మొదలవనుందని చిత్ర వర్గాల వెల్లడి. ఇందులో ఆమె బిగ్.బి కి కూతురిగా నటించనుందని టాక్. తెలుగు టాప్ గేర్ లో దూసుకుపోతున్న రష్మిక బాలివుడ్ లో తన విజయకేతనం ఎగురవేస్తుందో లేదో చూడాలి మరి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.