‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె, వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. నటనకు నటన, గ్లామర్‌కు గ్లామర్ ప్రదర్శిస్తూ సత్తా చాటుతోంది. ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఆమె, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి ఫ్లాప్ తర్వాత మరో సినిమాను ఓకే చేయలేదు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షాహిద్ కపూర్‌తో కలిసి రాశీ ఖన్నా ఓ వెబ్‌సిరీస్‌లో సందడి చేయనుంది. రాజ్ - డి.కె దర్శక ద్వయం యాక్షన్ థ్రిల్లర్ కథతో వెబ్‌సిరీస్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే జనవరిలోనే చిత్రీకరణ మొదలు కానున్నట్టు సమాచారం. షాహిద్ కపూర్‌తో పాటు దక్షిణాదికి చెందిన విజయ్ సేతుపతి తదితర తారలు అందులో నటిస్తున్నట్టు తెలిసింది. రాశీ ఖన్నా కూడా అవకాశం సొంతం చేసుకుంది. రాశీ ఖన్నా సోషల్ మీడయాలో చాలా యాక్టివ్ గా వుంటుంది. తన ఫ్యాషన్ ఫోటో షూట్స్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది. తాజాగా రాశీ ఖన్నా అదిరిపోయో ఫోటో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో రాశీ స్టన్నింగ్ లుక్ లో ఉంది. ఈ ఫోటో షేర్ చేస్తూ నువ్వు ప్రేమ మరియు మంచి ఉద్దేశం ఉన్నప్పుడు ఎదుగుతూ ఉంటాం అని చెప్పుకొచ్చింది.