2020 మొత్తానికి ఒక ముగింపుకొచ్చింది. ఈ సంవత్సరం భాష బేధం తేడా లేకుండా అందరికీ కష్టాలనే మిగిల్చింది. అందరినీ ఏదో విధంగా ఎఫెక్ట్ చేసింది. మొత్తానికి ఈ కోవిడ్ ఇయర్ పూర్తవ్వడంతో అందరూ 2021 అయినా తమకు కలిసొస్తుందేమో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందరూ సోషల్ మీడియాలో గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ డయాబెటిస్ ఎడ్యుకేటర్ రాశి చౌదరి పెట్టిన గుడ్ బై ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. "ఓకే బై బై 2020. ఏ సంవత్సరం నేర్పించిన పాఠాలు 2020 మనకు నేర్పించింది. ఈరోజు రాత్రి నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నా. నాకు ఇష్టమైనది తింటూ, ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. చిన్న రమ్ చాక్లెట్ కేక్ కూడా ఆర్డర్ చేద్దామనుకుంటున్నా. అలాగే నాకు ఏదైనా మూవీని రికమెండ్ చేయాలనుకుంటున్నారా? గైస్ అన్నట్లు మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి. బయటకు వెళ్తున్నారా, ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారా?" మరి రాశి చౌదరి అన్నట్లు మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి?