రకుల్ ప్రీత్ కి ఫిట్నెస్ పై ఉన్న శ్రద్ధ ఆమె సోషల్ మీడియా ని చూస్తే అర్థం అవుతుంది. ఆమె చాలా ఇంటర్వ్యూస్ లో ఖాళి ఉన్నప్పుడల్లా వ్యాయామం చేస్తా అని చెప్పారు. అయితే ఇప్పుడు రకుల్ కొత్తగా యోగ కూడా మొదలుపెట్టింది.అనుష్క యోగ సెంటర్ లో రకుల్ ప్రీత్ యోగ చేస్తున్న ఫోటోని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. రకుల్ ప్రీత్ ఈ ఫొటోలో తన ఫీట్ ని పట్టుకొని ఉంది. ఇలా యోగ చేయడం వల్ల తనకి చాలా సంతృప్తి గా ఉంది అని రోజు ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు కుదిరింది అని ఆమె అన్నారు. రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో నటిస్తున వైష్ణవ్ తేజ్- క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఓ బడా ఆఫర్ని దక్కించుకున్న ఈ అమ్మడు ఎగిరి గంతేసింది. అమితాబ్ ప్రధాన పాత్రలో మేడే అనే థ్రిల్లర్ డ్రామాని అజయ్ దేవగణ్ తెరకెక్కించనుండగా, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యమైన పాత్రలో నటించే అవకశాన్ని పొందింది. ఈ విషయాన్ని క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్వీట్ లో తెలిపిరు. అలాగే నితిన్ తో కలిసి చెక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి చంద్ర శేఖర్ ఎలాటి దర్శకత్వం వహిస్తున్నారు.