అందాల భామ రకుల్ ప్రీత్ సినిమాల్లో నే కాదు, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.రకుల్ ప్రీత్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఫిట్ నెస్ జిమ్ F-45 రీ-ఓపేన్ గురించి. F-45 అనే జిమ్ కు కోకాపేట్, వైజాగ్, గచ్చిబౌలిలో బ్రాంచెస్ ఉన్నాయి. కరోనా తర్వాత ఈ జిమ్ మళ్లీ ఓపెన్ చేశారు. జిమ్ కి వచ్చె ప్రతీ కస్టమర్ టెంపరేచర్ చెక్ చేయడం, ఫుల్ బాడీ సానిటైజ్ చేసుకునే సదుపాయం, జిమ్ లో ఉన్న ప్రతీ ఎక్విప్మెంట్ ను సానిటైజ్ చెయ్యడం లాంటి అన్ని రకాల ప్రొటెక్షన్స్ తో జిమ్ మళ్ళీ రీ-ఓపెన్ చేశారు. ఈ విషయం రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీడియో పోస్ట్ చేస్తూ “జిమ్ మన శరీరానికి దేవాలయం, ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి, అలాగే ఫిట్ బాడీలోఎప్పుడూ ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా ఉంటుంది. పనులు ఆగనప్పుడు బాడీ వర్కౌట్స్ ఎందుకు ఆపాలి” అంటూ ఫిట్ నెస్ గురించి మోటివేషన్ ఇచ్చింది. రకుల్ ప్రీత్ ప్రస్తుతం తెలుగులో నితిన్, చంద్రశేఖర్ యేలెటి కాంబినేషన్ లో వస్తున్న ‘చెక్’, దర్శకుడి క్రిష్ సినిమాలతో బీజీగా ఉంది. వీటితో పాటు హిందీ, తమీళ ప్రాజెక్ట్స్ లో కూడా నటిస్తూ ఉంది.