రాశిఖన్నా మొదటి సినిమా ఊహలు గుసాగుసలాడే సినిమాతో అందర్నీ ఆకర్షించింది. తర్వాత
జిల్, బెంగాల్ టైగర్, జై లవ కుశ లాంటి సినిమాల్లో ఆమె అందంతో యూత్ కి బాగా కనెక్ట్ అయింది.
అయితే ప్రస్తుతం రాశి ఖన్నా వరస ఫోటోషూట్స్ మరియు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఇక
తను ఈ మధ్యనే తన సిస్టర్ వెడ్డింగ్ లో పాల్గొన్నది. ఈ వెడ్డింగ్ లో దిగిన ఫొటోస్ ఇప్పుడు రాశి తన
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకుంటుంది. మెరున్ రంగు డ్రెస్ లో రాశి అందంగా అలాగే
సంప్రదాయంగా కనిపించింది. ఈ డ్రెస్ ని దీప్తి డిజైన్ చేశారు అలాగే జ్యూవెలరిని ముసుడిల్లా జెమ్స్ అండ్
జ్యూవెలరి కంపెనీ వారు తయారు చేశారు. అయితే తెలుగులో వరసగా సినిమాలు చేసే రాశి ఇప్పుడు
తెలుగుకు కొంచెం గ్యాప్ ఇచ్చి తమిళ్ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. రాశి ఖన్నా ప్రస్తుతం మూడు
తమిళ చిత్రాల్లో నటిస్తుంది. ఈ మధ్యనే విజయ్ సేతుపతికి జంటగా కొత్త సినిమాకు సైన్ చేసింది.
తెలుగులో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న రాశి తమిళ్ లో కూడా ఇలానే స్టార్ హీరోయిన్
అవుతుందో లేదో చూడాలి. ఆమె తెలుగులో చివరి చిత్రం విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన వరల్డ్
ఫేమస్ లవర్ సినిమా.