
అందాల తార రాశీ ఖన్నా తన ఇన్స్టాగ్రామ్ లో నేచర్ గురించి, మనిషి ప్రేమ గురించి చెప్తూ పెద్ద పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ తో పాటు రాశీఖన్నా నేచర్ ను ఆస్వాదిస్తున్న ఫోటో ను షేర్ చేసింది. ఈ ఫోటోలో రాశీ బ్యూటితో పాటు నేచర్ బ్యూటీ కూడా క్యాప్చర్ అయ్యింది. తెల్లటి మెఘాలు, నల్లటి నునుపు కొండలు, కొండల మధ్యన సముద్రం, సముద్రం పక్కన అందాల తార రాశీఖన్నా. ఈ ఫోటో చూడముచ్చటగా ఉంది. ఈ ఫోటోతో పాటు ఇలిఫ్ షఫక్ అనే ఫ్రాన్స్ రైటర్ ఫార్టీ రూల్స్ ఆఫ్ లవ్ పుస్తకం లోని వాక్యాలను చెప్పుకొచ్చింది. “యునివర్స్ అనేది ఒక్కటే ఉంది. ప్రతీ ఒక్కరూ ఎదో ఒక విధంగా కనెక్ట్ అయి ఉంటారు. మనకు తెలిస్తూ ఉన్నా, తెలియకుండా ఉన్న మనం అందరం నిశబ్ద చర్చలో పాల్గొంటున్నాం. మనం చెడు జోలికి వెళ్ళకుండా కరుణతో ఉందాం. వెనుక మాట్లాడుకునే మాటలు మనకు వద్దు. మనం మాట్లాడే ప్రతీ మాట నోటితో కాకుండా మనస్సుతో మాట్లాడుదాం. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు తిరిగి మనకు తగిలే సమయం తప్పకుండా ఉంటుంది. ఒకరి బాధ మనకు కూడ బాధ కల్గిస్తుంది. ఒకరి ఆనందం మనకు కూడా ఆనందమివ్వాలి” అంటూ చెప్పుకొచ్చింది. రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగులో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది. రాశీ ఖన్నా ఈ పోస్ట్ తో తన ఫిలాసఫీ చెప్పుకొచ్చింది.