‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసులను దోచుకుంది. రాశి ఖన్నా సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటది. ఇక ఈ మధ్య జరిగిన రాశి ఖన్నా ఫోటోషూట్ లోని ఫొటోస్ ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. లేత తెలుపు రంగు డ్రెస్ లో రాశి చాలా అందంగా కనిపించారు. రోజు షైన్ అవ్వండి అని రాశి క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోకి ఆమె ఫ్యాన్స్ చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న రాశి ఖన్నా తరచుగా ఫోటో షూట్ లు చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 5.7 మిలియన్ ఫాలోవర్స్ ను ఆమె కలిగి ఉంది. రాశిని ఫాలో అయ్యే ఫ్యాన్స్ కోసం ఆమె ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది.రాశి ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కోలీవుడ్ పైనే పెట్టింది. రాశి ఖన్నా ప్రస్తుతం మూడు తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఈ మధ్యనే విజయ్ సేతుపతికి జంటగా కొత్త సినిమాకు సైన్ చేసింది. తెలుగులో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న రాశి తమిళ్ లో కూడా ఇలానే స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.