
అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టిన ప్రణీత సుభాష్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా నటించి మెప్పించింది. తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉండే ప్రణీత ఇప్పడు మాల్దీవుస్ లో హోలిడేని ఎంజాయ్ చేస్తుంది. అయితే ప్రణీత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్న ఒక ఫోటో అందరిని ఆకర్షిస్తుంది. తన చిన్నప్పుడు తన తండ్రి, బంధువులతో దిగిన ఫోటోని ప్రణీత తన అభిమానులతో పంచుకుంది. ఫామిలీ ఒకటే మనకి ఎప్పటికి ఉండే ధనం అని కాప్షన్ తో ఈ ఫోటోని ప్రణీత పోస్ట్ చేసింది.ఈ ఫొటోలో ప్రణీత చూడటానికి చాలా అందంగా ఉంది. ప్రస్తుతం మాల్దీవుస్ సముద్రపు ఒడ్డున అందాలని ఎంజాయ్ చేస్తున్న ప్రణీత సుభాష్ అక్కడ ఈ మధ్యనే స్కూబా డైవింగ్ కూడా చేసింది. ఇక ట్రిప్ అయిపోయాక మళ్ళీ తను సినిమా షూటింగ్స్ లో పాల్గొనబోతుంది. ఇక ప్రణీత ప్రస్తుతం కరోనా సంక్షోభంలో తనకి ఉన్నంత దానిలో సాయం చేస్తూ అందరి మనసులని గెలుచుకున్న ప్రణీత కరోనా బాధితుల కోసం విరాళం కూడా ఇచ్చింది. తను ఒక వెబ్ సైట్ ద్వారా కరోన బాధితులకు విరాళాలు కూడా సేకరిస్తుంది.