యాడ్ షూట్ కోసం హాట్ గా మారిన పూనమ్ బాజ్వా

పూనమ్ బాజ్వా కూచిపూడి వెంకట్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ద్వారా ఈ నటి తెలుగు సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా ప్లాప్. మళ్ళీ నవదీప్ తోనే మరో సినిమా చేసింది అది కూడా ప్లాప్. ఇక నాగార్జున బాస్ లో ఒక చిన్న రోల్ లో కనిపించింది. దీని ఫలితం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా వరస సినిమా ప్లాపులతో పూనమ్ కెరీర్ తెలుగులో బాగా వెనుకపడింది. అయితే తమిళం, కన్నడ, మలయాళం సినిమాలతో పూనమ్ అడపాదడపా అవకాశాలను చేజిక్కించుకుంటూనే ఉంది. 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఒక చిన్న రోల్, తమిళంలో మరో సినిమా చేసిన పూనమ్, ఆ తర్వాత నుండి మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం అవకాశాల కోసం తన వేటను కొనసాగిస్తోంది.అయితే ఇన్స్టాగ్రామ్ లో తన గ్లామరస్ ఫోటోలను అప్లోడ్ చేసే ఈ నటి రీసెంట్ గా ఒక యాడ్ షూట్ కోసం వేసుకున్న డ్రెస్ ఆకట్టుకునేలా ఉంది.చేతిలో సితారతో ఫుల్ వైట్ లో పూనమ్ అదరగొడుతోంది. మరి ఇలాంటి ఫొటోలతో ఆమె ఏమైనా అవకాశాలను దక్కించుకుంటుందేమో చూడాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.