తొలి చిత్రం 'ఆర్ఎక్స్-100' విజయంతో పాయల్ రాజపుట్ కి ఎన్నో ఆఫర్ల వచ్చాయి. తన అందంతో పాయల్ టాలీవుడ్ జనాల హృదయాలు కొల్లగొట్టింది. రవితేజ, వెంకటేష్ లాంటి టాప్ హీరోస్ తో నటిస్తూనే చిన్న సినిమాల్లో కూడా కనిపిస్తూ పాయల్ దూసుకెళ్తుంది. అయితే పాయల్ ఈ మధ్య ఒక ఫోటోషూట్ లో పాల్గొన్నది. ఈ ఫోటోషూట్ లో తీసిన చిన్న వీడియోని పాయల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంది. ఒక మధ్యాహ్నం ఫోటోషూట్ లో గడిచిపోయింది అని అక్కడ మంచి సంగీతం, మంచి టీం తో బాగా గడిపాను అని ఆమె అన్నారు. ఈ ఫోటోషూట్ లో బ్లూ సూట్ లెహంగా వేసుకొని పాయల్ ఫోటోలకి స్టిల్స్ ఇచ్చింది. ఇక పాయల్ ప్రస్తుతం ఫోటోషూట్స్ లో అలాగే సినిమాలలో బిజీ బిజీగా గా ఉంది . ఈ మధ్యనే పాయల్ నటించిన 'అనగనగా ఓ అతిథి' సినిమా ఆహా ఓ.టి.టి లో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో పాయల్ చైతన్య కృష్ణ తో కలిసి నటించారు. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయిన ఆ కరాళ రాత్రి సినిమాకి తెలుగు రీమేక్. తెలుగులో కూడా కన్నడ సినిమా డైరెక్టర్ డయల్ గరే దర్శకత్వం వహించారు.