అందాల తార, గ్లామర్ ముద్దగుమ్మ, హాట్ బ్యూటీ, ఆర్.ఎక్స్ 100తో తెలుగు తెరపై మెరిసిన అందం పాయల్ రాజ్ పుత్. మొదటి చిత్రంతోనే సంచలన విజయం అందుకున్న ఈ ఉత్తరాది సోయగం. ఆ పై వెంకీమామ, డిస్కోరాజా వంటి ఫిల్మ్స్ లో కనువిందు చేసింది. మధ్యలో ఆర్డీఎక్స్ లవ్ నిరాశపరిచినా పాయల్ కి యూత్ లో క్రేజ్ రోజు రోజుకి పెరుగుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాల్లో నాయికగా నటిస్తోంది. జయంత్ సి. పరాన్జీ రూపొందిస్తున్న నరేంద్రలో గెస్ట్ రోల్ చేస్తోంది. ఆహా లో రిలీజ్ అయిన అనగనగా ఓ అతిథి లో తన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఆ మధ్య సీతలో ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది ఈ మిస్ రాజ్ పుత్. అలాగే పాయల్ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ ఫోటో స్ తో అలరిస్తుంటుంది. తాజాగా పాయల్ ఫ్యాషన్ పై ఆసక్తి చూపుతోంది. ట్రెండీ డ్రస్సుల్లో గ్లామర్ తో అదరగొడుతోంది. పాయల్ తాజాగా డిజైనర్ రెడ్ డ్రెస్స్ లో న్యూ హేయిర్ స్టైల్ లో వున్న తన ఫ్యాషన్ పిక్ ను పాయల్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో పోస్ట్ చేస్తూ “ఫ్యాషన్ ఆహారం లాంటింది అందుకే మెను ఎప్పుడూ ఒకటే వుండొద్దు” అంటూ చెప్పుకొచ్చింది.