పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమాతోనే హిట్ కొట్టి టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హాట్ అందాలతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మతులు పోగొట్టింది. హాట్‌గా నటించి సెగలు రేపిన ఈ బ్యూటీ.. తన నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది. అప్పటివరకు ఏ హీరోయిన్ చేయనటువంటి పాత్రను చేయడంతో ఆ ఒక్క చిత్రంతోనే ఈ అమ్మడు రేంజ్ తారా స్థాయికి చేరింది తొలి చిత్రంతోనే ఈ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. గ్లామర్ పాత్రలు చేస్తున్నప్పటికీ ఎప్పుడూ నేను హద్దులు దాటాను. నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని నేను తప్పకుండా పాటిస్తాను. నా కెరీర్ ఇప్పుడు మొగ్గ దశలోనే ఉందని, అందాల ఆరబోతలో హద్దులు దాటబోనని పాయల్ భామ చెప్పుకొచ్చింది. పాయల్ నటించిన అనగనగా ఓ అతిథి ఆహాలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో పాయల్ గ్లామర్ తో పాటు నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి. అలాగే 5.W అనే చిత్రంలో పాయల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరిలో విడుదలకు సిద్దం కానుంది. తాజాగా పాయల్ తన ఫోటోస్ తో ఇన్స్టాగ్రామ్ నింపేస్తుంది. తాజాగా పాయల్ తన బ్యూటిఫుల్ గౌన్ చేత్తో పట్టుకుని మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో పెడుతూ మీ కామెంట్ ఎమోజీతో తెలపండి అంటూ అభిమానులతో పంచుకుంది.