తన స్టన్నింగ్ యాక్టింగ్ తో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్న నటి నివేదా థామస్. నిన్ను కోరి, జెంటిల్‌మేన్, బ్రోచేవారెవరురా, దర్బార్ లాంటి సూపర్‌హిట్ సినిమాలు ఇప్పటికే ఆమె ఖాతాలో ఉన్నాయి. 2008లో వచ్చిన మలయాళం సినిమా ‘వెరుతే ఒరు భార్య’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నివేదా తను తమిళంలో చేసిన మొదటి చిత్రం 'కురువి'తో మంచి పేరు సాధించారు. మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయిన దృశ్యం సినిమాకు తమిళ రీమేక్‌గా వచ్చిన పాపనాశం సినిమాతో నివేదాకు అసలైన బ్రేక్ వచ్చింది. ఇందులో కమల్ హాసన్ సుయంబులింగం పాత్ర పోషించగా, నివేదా ఆయన కూతురు సెల్విగా నటించారు. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న నివేదా షూటింగ్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. తాజాగా క్రిస్మస్ సంధర్బంగా నివేదా పోస్ట్ పెడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది. ఆకాశంలోకి చూస్తూ స్మైల్ ఇస్తున్న ఫోటోను నివేదా థామస్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో నివేదా క్యూట్ లుక్ లో అదిరిపోయింది. ఆకాశంలోకి చూస్తూ క్రిస్మస్ గాలి పీల్చుకుంటూ ఈ ప్రపంచం కోసం, మన అందరికోసం ప్రార్థన చేస్తున్నాను. మనమందరం, దయతో, గొప్పగా, ప్రేమతో మెలగాలి అని చెబుతూ మెర్రి క్రిస్మస్ మరియూ స్టే సేఫ్ అండ్ బీ హ్యప్పీ అంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది.