


మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్ళి వేడుకలు ప్రస్తుతం అట్టహాసంగా జరుగుతున్నాయి. నిహారిక హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ టెక్కీ చైతన్య జొన్నలగడ్డను వివాహమాడుతున్న విషయం తెల్సిందే. డిసెంబర్ 9న వీరి వివాహం జరగనుంది. రాజస్థాన్ లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ను పెళ్ళి వేదికగా ఖరారు చేసారు. ఇక 10 రోజుల ముందు నుండే నిహారిక పెళ్ళి సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మెగా కజిన్స్ అందరూ ఇప్పటికే పలు సార్లు కలిసి పార్టీ చేసుకున్నారు కూడా. మొన్న నిహారిక పెళ్ళి కూతురు ఫంక్షన్ జరిగింది. చిరంజీవి ఈ వేడుకకు హాజరై కొత్త పెళ్ళి కూతురుకి సతీసమేతంగా తన ఆశీస్సులు అందజేశాడు. నిన్న మెగా ఫ్యామిలీ మొత్తం వివాహ వేదికకు చేరుకున్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, ఇలా ఎవరికి వారు చార్టెడ్ ఫ్లయిట్స్ లో రాజస్థాన్ కు చేరుకోవడం విశేషం. నిన్న రాత్రే సంగీత్ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయ్. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వివాహ వేడుకకు రాగా పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అన్నది సస్పెన్స్ గా మారింది.
