

మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత న్యూ ఇయర్ వేడుకలను యూస్లో ఎంతో సింపుల్గా జరుపుకుంది. ఎపుడూ కుటుంబ సభ్యులు, స్నేహితులుతో ఎంతో ఆప్యాయంగా కొత్త యేడాది వేడుకలను చేసుకునే నిహారిక, ఇపుడు తన భర్త చైతన్యతో కొత్త యేడాది వేడుకలను చేసుకుంది. ఈ సందర్భంగా తన ఫ్యామిలీని మిస్ అయిన సందర్భంగా వాళ్లతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నిహారిక పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడ తన భర్తను కలిసి హానీమూన్ వెకేషన్స్ను సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ జంట, అటు నుంచి అటు యూస్కు వెళ్లారు. అక్కడే నిహారిక తన కొత్త యేడాదికి స్వాగతం పలికింది. ఒక రకంగా పెళ్లి తర్వాత నిహారికు ఇదే కొత్త న్యూ ఇయర్. తన హనిమూన్ ఫోటోలు ఎప్పటకప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది. ఈ పోటోలు కొన్ని గంటల్లోనే వైరల్ అవుతున్నాయి. తాజాగా తన భర్తతో కలిసి ఇసుకలో తీసుకున్న ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో కపుల్ హగ్ లో ఉన్నారు వెనక సూర్యూడు ఉండి ఫోటో చూడముచ్చటగా వుంది. ఈ ఫోటో నిహారిక పోస్ట్ చేస్తూ పైన ఆకాశం, కింద ఇసుక మాతో ప్రశాంతత ఉంది అని చెప్పుకొచ్చింది.