ఇస్మార్ట్ భామ రోజు రోజుకి ఫుల్ క్రేజ్ సంపాదిస్తుంది. హిరోయిన్ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టి తన అందాలతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచెసింది. సోషల్ మీడియాల్లో తన ఫోటో షూట్స్ తో ఎప్పుడు వైరల్ గా నిలుస్తోంది ఈ భామ. బాలీవుడ్ నుంచి తెలుగు వెండితెరకు దిగుమతి అయిన హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈమె నటించిన చిత్రాలు వేళ్ళపై లెక్కించవచ్చు. 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' వంటి చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు ఈ అమ్మడుకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. కానీ, 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం మాత్రం సూపర్ డూపర్ హిట్. దీంతో ఈ అమ్మడు ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. చాలా తక్కువ టైం లో టాప్ హిరోయున్స్ లో ఒకరిగా ఎదిగారు నిధి ఆగర్వాల్. తను ఒక్క ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటే ఆ ఫోటోకి వీపరతమైన క్రేజ్ సంపాదించి వైరల్ అవుతుంది. నిధి అందాలకు తెలుగు కుర్రకారు ఫిదా అయిపోయి నిధికి ఫ్యాన్స్ అయిపోతున్నారు. తాజాగా వుమెన్ ఫిట్‌నెస్ ఇండియా మ్యాగ్జైన్ కవర్ ఫోటోగా నిధి అగర్వాల్ ఫోటో పడింది. ఈ విషయం నిధి ఆగర్వాల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఈ ఫోటోలో నిధి అగర్వాల్ బ్యూటీపుల్ లుక్స్ తో అందమైన రెడ్ సెక్సీ డ్రెస్స్ లో తన అందంతో పిచ్చెక్కిస్తూ స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టింది నిధి.