
అందాల తార నయనతార పుట్టిన రోజు ఈ రోజు. నయనతార పుట్టిన రోజు సంధర్భంగా ఆమె నటిస్తున్న నెట్రికన్ సినిమా టీజర్ విడుదల చేశారు.లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ తమిళ్ మూవీ ‘నెట్రికన్’. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘గృహం’ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న మిలింద్ రావ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించబోతోంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా పోషించే నయనతార మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దపడింది. తాజాగా నయనతార పుట్టన రోజు సంధర్బంగా నెట్రికన్ చిత్రం టీజర్ ను విడదల చేశారు. ఈ చిత్ర టీజర్ ను నయన తార తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ విడుదల చేశారు. టీజర్ లో మర్డర్ మిస్టరీతో సాగే కథ లో నయన తార అంధురాలిగా కనిపిస్తూ అదరగొట్టింది. టీజర్ చివర్లో వచ్చిన “నీ కళ్ళకు ఏమీ కనిపించవు, నా కళ్ళకి నీకు సంబధించిన అన్ని విషయాలు కనిపిస్తున్నాయి” అనే డైలాగ్ సినిమా మీద ఇంకా హైప్ ను క్రియేట్ చేసింది. టీజర్ తో ప్రేక్షకులకు, నయనతార అభిమానులకు ఆసక్తి కలిగించి సినిమా తోథ్రిల్ చేయనున్నారు. ఈ సినిమా 2021 విడుదల కానుంది.