
అందాల భామ, స్టార్ హిరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార తన 36వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ లలో నయనతార ఒకరు. ‘మనస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. చంద్రముఖీ సినిమా ద్వారా తెలుగులోకి పరిచయమయ్యింది. తర్వాత వెంకటేష్ సరసన లక్ష్మీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బాపు చిత్రం 'శ్రీరామరాజ్యం'లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. తర్వాత లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేస్తూ మంచి గుర్తింపు పొంది స్టార్ హిరోయిన్ గా ఎదిగింది. సినిమా సినిమాకి తన ఇమెజ్ పెంచుకుంటూ ప్రముఖ నటీమణుల జాబితాలో చేరిపోయారు. నిన్న నయనతార పుట్టినరోజు బిజీ బిజీగా ఉంటూ వరుస సినిమాలు చేస్తూ సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. తాజాగా నయనతార బర్త్ డే సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. గోల్డెన్ కలర్, వైట్ కలర్ బెలూన్స్ తో, పూల్ లైటింగ్స్ పెద్ద ఫ్లవర్ బొకేతో అలంకరించిన స్టేజ్ లో అందమైన బ్లాక్ డ్రస్ లో వున్న నయన్ ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. బ్యాక్ గ్రౌండ్ లో హ్యాపీ బర్త్ డే మోల్ అని రాసి ఉంది. మోల్ అంటే మలయాళంలో పాపా అని అర్థం. ఈ ముప్పై ఆరెళ్ళ భామ ఇంకా తన అందంతో, నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంది.