రూమర్స్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన నయనతార టీమ్

సౌత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నయనతార పేరు కచ్చితంగా ముందు వరసలో ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలకు నయన్ ఫస్ట్ చాయిస్ గా మారిపోయింది. తనకున్న డిమాండ్ కు తగ్గట్లుగానే నయన్ భారీ రెమ్యునరేషన్ ను కూడా తీసుకుంటోంది.  ప్రస్తుతం నయనతార చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఆమె ఇప్పుడు మూడు తమిళ సినిమాల్లో నటిస్తోంది. నేత్రికన్ షూటింగ్ దశలో ఉంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న అన్నాతే సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కథువాకుల రెండు కాదల్ చిత్రంలో నయన్ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. సమంత మరో లీడ్ రోల్ చేస్తోంది. అయితే గత కొంత కాలం నుండి నయన్ వేలు నాచ్చియార్ అనే రాణి జీవితం ఆధారంగా తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అంటూ రూమర్స్ వచ్చాయి. దీనిపై నయన్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తన టీమ్ ద్వారా నిజాన్ని తెలుసుకుని ఏదైనా వార్త రాయాలని సూచించింది. ఆ సినిమాలో తాను నటించట్లేదని క్లియర్ చేసింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.