నాకు సర్ప్రైజ్ ఇచ్చినందుకు థాంక్ యూ అంటున్న నభా

'ఇస్మార్ట్ శంకర్‌'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నభా నటేష్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే నభా నటేష్ డిసెంబర్ 11న  తన 25వ పుట్టినరోజును జరుపుకుంది. అయితే ఆ రోజు తనకి ఒక సర్ప్రైజ్ వచ్చింది. అదేంటి అంటే ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ నభా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా టీం ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ ని విడుదల చేసి తనకి విషెస్ చెప్పినందుకు నభా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సోలో బ్రతుకే సో బెటర్ మూవీ టీం థాంక్ యూ అని చెప్పింది నభా నటేష్. ఈ సినిమాలో నభా అమృత అనే పాత్రలో నటిస్తుంది. ఇక సుప్రీమ్ హీరో సాయి తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  ఈ సినిమా టైటిల్ ట్రాక్ ని ఈ మధ్యనే రిలీజ్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం థమన్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలన్నిటికీ మంచి స్పందన వచ్చింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.