నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నభా నాటేష్ ఆ సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇక తరవాత స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండే నభా నాటేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా పోస్ట్ లు పెడుతుంది. అయితే నబా నాటేష్ ఫ్లైట్ లో మాస్క్ ని ధరించి ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. మనమంతా మళ్ళీ మాములు పరిస్థితికి వచేస్తున్నాం, అందరం మన కుటుంబాలతో కలిసి ఉంటున్నాం కానీ జాగ్రతలు తీసుకోవడం మాత్రం మరచిపోకండి ఎందుకంటే దీని వల్ల మనము మనతోపాటు ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది. మాస్క్ ని ధరించండి, చేతులు సానిటైజ్ చేసుకోండి అని నభా నాటేష్ తన పోస్ట్ లో తెలిపారు. ఇక నభా నాటేష్ ప్రస్తుతం నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమ డిసెంబర్ 25 న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ఆమె సాయి ధరమ్ తేజ్ కి జోడిగా నటిస్తుంది. కరోన తర్వాత థియేటర్స్ లోకి వస్తున్న పెద్ద చిత్రం ఇదే. ఈ సినిమాకి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు , టీజర్స్ కి చాలా మంచి స్పందన వచ్చింది. కరోన తరవాత విడుదలవుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు చాలా ఉన్నాయి.