
‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మెహ్రీన్ కౌర్ పిర్జాదా. తొలి సినిమా మంచి విజయం సాధించడంతో ఈ పంజాబీ బ్యూటీకి అవకాశాలకు కొదవ లేకుండా పోయింది. మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్-2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ వంటి భారీ విజయాలతో అమ్మడి రేంజ్ బాగా పెరిగింది. అయితే ఆ తర్వాత పరాజయాలు మెహ్రీన్ ను ఇబ్బంది పెట్టాయి. ఎఫ్-2 తర్వాత చేసిన చాణక్య, ఎంత మంచివాడవురా, అశ్వద్ధామ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి పరాజయం సాధించాయి. ఇక దాని తర్వాత మెహ్రీన్ కు అవకాశాలు పెద్దగా రాలేదు. అయితే డోర్లు మూసుకుపోతున్న తరుణంలో మెహ్రీన్ కు ఎఫ్-2 సీక్వెల్ ఎఫ్-3 రూపంలో మంచి అవకాశం వచ్చింది. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇదిలా ఉంటే ఈ పంజాబీ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తాజా పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ట్రెండీ ఔట్ ఫిట్ తో గ్లామర్ ఒలకబోస్తోంది మెహ్రీన్. ఈమె ఎఫ్-3 చిత్రంతో విజయం సాధించి మళ్ళీ తిరిగి అవకాశాలను సాధించాలని కోరుకుందాం.