
నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ తరువాత తెలుగులో ఛల్ మోహన్ రంగ సినిమాలో కూడా నితిన్‌కు జోడిగా నటించింది. చేసినవి కొన్ని సినిమాలైన యువతలో మంచి అభిమానం సంపాదించుకున్న మేఘ ఆకాష్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తన కోరికగా మేఘ ఆకాష్ కరోన వలన నష్టపోయిన అందరూ మళ్ళీ మాములు పరిస్థితికి రావాలని చిన్న బిసినెస్ ల నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరినీ కరోన ఇలా చేసింది అని ఆమె తన పోస్ట్ లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని పెట్టారు. తన స్నేహితులు నటి అభిరామి, కృత్తిక, ఐషూ ని ఈ కోరిక ను కొరుకోవాల్సిందిగా ఆమె కోరారు. ఆమె డిస్నీ హాట్ స్టార్ లో ‘మూకుతి అమ్మన్’ సినిమా చూడండి అని చెప్పారు. ఈ మధ్యనే వచ్చిన లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ముకుతి అమ్మన్ సినిమా ని మేఘ ఆకాష్ ఇలా ప్రమోట్ చేస్తుంది. ఈ సినిమా తెలుగులో అమ్మొరు తల్లి గా కూడా డబ్ చేశారు. ఆర్.జె బాలాజీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.