క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, హీరోయిన్ గా మంచు లక్ష్మీ కి టాలీవుడ్ లో మంచి పేరు అలాగే విజయాలు కూడా ఉన్నాయి. ఆమె ప్రముఖ నటుడు మోహన్ బాబు గారి కూతురు అయినప్పటికీ కూడా తనకంటూ ఒక స్థాయి ని సంపాదించుకుంది. అయితే ఈ కరోన వలన చాలామంది ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అలా తనతో పాటు ఉంటూ తనని ప్రోత్సహించిన తన స్నేహితులకు, తల్లి తండ్రులకి, అందరికీ ఆమె ఈ థాంక్స్ గివింగ్ అంటూ ఒక వీడియో రూపంలో కృతజ్ఞతలు చెప్పింది. ఈ వీడియోని ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ఈ వీడియో లో ఆమె తల్లి తండ్రుల నుంచి తుమ్ముళ్లు విష్ణు , మనోజ్ అలాగే ఇండస్ట్రీలో స్నేహితులు రకుల్, తాప్సి ఇలా చాలా మంది ఉన్నారు. ఇంత కష్టమైన సమయంలో వీళ్లంతా తన వైపు ఉన్నారని , వీళ్ళతో గడిపిన క్షణాలలో చాలా నేర్చుకున్న అని ఆమె అన్నారు. అందరికీ ఈ థాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు అని కాప్షన్ పెట్టారు. ఎక్కువ అమెరికా లాంటి దేశాల్లో జరుగుకునే ఈ థాంక్స్ గివింగ్ ఫెస్టివల్ మన ఇండియాలో కూడా చాలా మంది జరుపుకుంటారు. ఈరోజున ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేయడం ఈ పండగ రోజు ముఖ్య ఉద్దేశం.