లక్ష్మీ మంచుకి సినిమాల్లోనే కాకుండా ఫ్యాషన్ రంగంలో కూడా మంచి అవగాహన ఉంది. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో దాదాపుగా తన జీవితంలో జరిగే అన్ని విషయాలని పంచుకుంటుంది. అలాగే ఆమె తన వేసుకున్న దుస్తులని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది. ఈ విషయం మనం ఆమె తన సోషల్ మీడియాలో పెట్టే ఫొటోస్ చూసే చెప్పొచ్చు. ఆమె వేసుకునే దుస్తులు చాలా స్టైల్ గా ఉంటాయి. అయితే మంచు లక్ష్మి ఇప్పుడు తన కొత్త ఫోటో షూట్ కి సంబందించిన ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వార పోస్ట్ చేసింది. మీరు నన్ను రెండు విధాలుగా చూస్తారు, ఒకటి ఇతరులని ప్రేరేపిస్తూ లేక నన్ను నేను మెరుగుపర్చుకుంటు అని ఆమె తన పోస్ట్ ద్వారా తెలిపింది. ఈ పోస్ట్ కి రకుల్ ప్రీత్ సింగ్ కూడా సూపర్ హాట్ అని కామెంట్ చేసింది. ఈ ఫోటోస్ లో మంచు లక్ష్మి చాలా స్టైలిష్ గా కనిపించింది. ఇక మంచు లక్ష్మి ఈ మధ్యనే తన కొత్త ఆఫీస్ ని మొదలుపెట్టింది. తన కూతురుతో కలిసి ఈ కొత్త ఆఫీస్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫొటోస్ ని మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి సినిమాల్లో నటిస్తూ, మరియు నిర్మిస్తూ బిజీగా వుంది.