క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, హీరోయిన్ గా మంచు లక్ష్మీ గారికి టాలీవుడ్ లో మంచి పేరు అలాగే విజయాలు కూడా ఉన్నాయి. ఆమె ప్రముఖ నటుడు మోహన్ బాబు గారి కూతురు అయినప్పటికీ కూడా తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకుంది. అయితే కార్తీక మాసం సందర్భంగా మంచు లక్ష్మి తన అమ్మ నాన్నలతో కలిసి వాళ్ళ ఇంట్లో పూజ చేశారు. ఈ పూజలోని ఫొటోస్ ని తన సోషల్ మీడియాలో పంచుకుంది. యెల్లో, బ్లూ రంగులతో ఉన్న చీరని ధరించి ఆమె ఈ పూజ లో పాల్గొన్నారు. ఈ కార్తీక మాసం నెల అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా అని ఆమె తన పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ పోస్ట్ కి మంచు లక్ష్మి అభిమానులు శారీ చాలా బాగుంది అని కామెంట్ చేశారు. ఈ ఫోటోస్ లో మంచు లక్ష్మి చాలా సంప్రదాయంగా కనిపించింది. ఇక మంచు లక్ష్మి ఈ మధ్యనే తన కొత్త ఆఫీస్ ని మొదలుపెట్టింది. తన కూతురుతో కలిసి ఈ కొత్త ఆఫీస్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫొటోస్ ని మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి సినిమాల్లో నటిగా నిర్మాతగా బిజీగా వుంది.