మంచు లక్ష్మి సోషల్ మీడియాలో దాదాపుగా తన జీవితంలో జరిగే అన్ని విషయాలని పంచుకుంటుంది. ఇక లక్ష్మీ మంచుకి సినిమాల్లోనే కాకుండా ఫ్యాషన్ రంగంలోను మంచి అవగాహన ఉంది. ఆమె తను వేసుకున్న దుస్తులని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది. ఈ విషయం మనం ఆమె తన సోషల్ మీడియాలో పెట్టె ఫొటోస్ చూసే చెప్పొచ్చు. అయితే తను వేసుకున్న డ్రెసులతో మంచు లక్ష్మి ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియో చేసింది. అందులో మంచు లక్ష్మీ పొద్దునే నైట్ డ్రెస్ తో లేచి వెంటనే రెడ్ డ్రెస్ లో స్టైలిష్ గా కనిపించి, మళ్ళీ బ్లాక్ డ్రెస్ లోకి మారిపోయింది. ఈ రీల్ వీడియో చూడటానికి చాలా ఫన్నీ గా ఉంది. ఈ డ్రెస్ లలో మంచు లక్ష్మి చాలా స్టైలిష్ గా కనిపించింది. ఇక ప్రస్తుతం మంచు లక్ష్మి సినిమాల్లో నటిస్తూ, మరియు నిర్మిస్తూ బిజీగా వుంది. అలాగే రానా యూట్యూబ్ ఛానల్ సౌత్ బే లైవ్ లో మంచు లక్ష్మి సెలెబ్రిటీస్ తో ఫన్నీ గా ఇంటర్వ్యూలని చేస్తుంది. ఈ మద్యనే ప్రముఖ దర్శకుడు రాజమౌళిని అలాగే హాలీవుడ్ దర్శకుడు ఫ్రాంక్ కోరాసి ఇద్దరితో మంచు లక్ష్మి చేసిన ఇంటర్వ్యూ యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది.