మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ. ఆరేళ్ల వయసులోనే చెస్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది విద్య. తాజాగా.. నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో..యంగెస్ట్ చెస్ ట్రైనర్ గా చోటు దక్కించుకుంది. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి ఈ సర్టిఫికెట్ అందజేశారు. విద్యా నిర్వాణ ప్రపంచ రికార్డ్ సాధించడంతో మంచు ఫ్యామిలీలో ఆనందం వెల్లి విరిసింది. మంచు లక్ష్మి ఆనందం అయితే అంతా ఇంతా కాదు. మామూలుగానే మంచు లక్ష్మి ఎప్పుడూ మురిసిపోతూ.. తన కుతూరు నిర్వాణ ఫోటోలు పెడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకాస్త ఆనందంగా ఉంది. తల్లి గా ఎంతో గర్వంగా ఉందని.. పోస్ట్ చేసింది. నిర్వాణ బహుమతికి సంబంధించి ఫోటోను షేర్ చేసి “నేను నిర్వాణ కన్నా చాలా నర్వస్ గా వున్నాను నా కుతురు నోబెల్ బహుమతి పొందడం చాలా గర్వంగా, ఆనందంగా వుంది” అంటూ చెప్పుకొచ్చింది. మోహన్ బాబు దంపతుల సమక్షంలో.. నోబెల్ బుక్ సర్టిఫికెట్ అందుకుంది.. మంచు లక్ష్మి కూతురు నిర్వాణ.. ఇక మంచు లక్ష్మికి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో తెలిసిందే కదా. అందరూ విష్ చేస్తూ.. కూతుర్ని కన్నప్పుడు కాదు.. కూతురు ఏదైనా సాధించినప్పుడే కూతురోత్సాహం ఉంటుంది అంటూ.. విష్ చేస్తున్నారు.