మంచు మోహన్ బాబు కూతురు డెరింగ్ డాషింగ్ ఉమెన్ మంచు లక్ష్మీ. తెలుగు ఇండస్ట్రీలో మంచు లక్ష్మీకి ప్రత్యేక స్థానం ఉంది. మంచు లక్ష్మీకి సినిమాలతో పాటు ఆరోగ్యం అంటే కూడా చాలా శ్రద్ద. మంచు లక్ష్మీ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ కెరీర్ తో కొనసాగుతూ ఉంది. స్టార్ నటుడు మంచు మోహన్ బాబు కుమార్తె గా ఎంట్రీ ఇచ్చినప్పటికి మంచు లక్ష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండిపెండెంట్ ఉమెన్ గా ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా వుంటుంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ ముద్దుగుమ్మలంతా ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్లో అప్ టూ డేట్ ఉంటారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన విశేషాలను అందులో పోస్ట్ చేస్తుంటారు. అలాగే మంచు లక్ష్మీ కూడా తనకు సంబందించిన విషయాలు తన అభిమానులతో పంచుకుంటుంది. తన జిమ్ యోగా ఫోటోలు, సినిమా అప్ డేట్స్ అన్ని షేర్ చేసుకుంటారు. తాజాగా లక్ష్మీ మంచు తన కూతురు నివి కలిసి లాక్ డౌన్ లో చేసిన యాక్టివిటీస్ ఎపిసోడ్స్ గా ప్లాన్ చేశారు. దానికి సంబంధించి మొదటి ఎపిసోడ్ ని మంచు లక్ష్మీ తన ఇన్స్టాగ్రామ్ లో విడుదల చేసింది. చిట్టిచిలకమ్మ పేరుతో ఈ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో నివి, మంచు లక్ష్మీ చేసె పనులు, లైఫ్ స్టైల్, హెల్త్ గురించి వుంటాయి.