నేల టికెట్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన మాళవిక శర్మ ఆ సినిమాలో తన అందంతో, నటనతో అందరినీ మెప్పించింది. ఇక ఆ సినిమా తర్వాత రామ్ తో కలిసి రెడ్ సినిమాలో కూడా నటిస్తుంది. అయితే మాళవిక సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రిటైల్ ఎంప్లాయ్స్ డే రోజున రిటైలర్స్ మరియు రిటైల్ ఎంప్లాయ్స్ కి విషెస్ చెప్పారు. తన తరుపున పుమా కంపెనీ కి థాంక్ యు చెప్పింది. పుమా రిటైలర్స్ తనకి చాలా హెల్ప్ చేసింది అని ఆమె అన్నారు. మీరందరు కూడా మీకు నచ్చిన రిటైలర్స్ కి థాంక్ యు చెప్పండి అని ఆమె తన పోస్ట్ ద్వారా తెలిపింది. ఇక మాళవిక శర్మ సినిమాల విషయానికి వస్తే ఆమె నటించిన రెడ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో రామ్ రెండు క్యారెక్టర్స్ చేస్తున్న ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తడమ్ సినిమాకి రీమేక్. ఇందులో మాళవిక పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, అలాగే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని సంక్రాంతికి థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.