టాలీవుడ్ లో నేలటికెట్ సినిమాతో పరిచయమై తన అందంతో అలరించిన బ్యూటీ మాళవిక శర్మ ఇప్పుడు తన ఫొటోషూట్ లతో అందరి కళ్ళు తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా ఫోటో షూట్ లో మాళవిక క్రిస్మస్ డ్రెస్ లలో చాలా హాట్ గా మరియు అందంగా కనిపించింది. మై సౌత్ దివా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఫోటోషూట్ కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసారు. ఈ ఫోటోషూట్ ఫొటోస్ మై సౌత్ దివా 2021 క్యాలెండర్ లో రాబోతున్నాయి. ఈ వీడియోలో మాళవిక తనకి ఇచ్చిన బెస్ట్ క్రిస్టమస్ గిఫ్ట్స్ గురించి చెప్పింది. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక మై సౌత్ దివా ఛానల్ ద్వారా కొత్త హీరోయిన్స్ ఫోటోషూట్స్, వాటికి సంబంధించిన వీడియోస్ ని ప్రత్యేకంగా పోస్ట్ చేస్తుంటారు. ఇక మాళవిక శర్మ చేసింది ఒకటే సినిమా అయినప్పటికీ సోషల్ మీడియాలో తనకి చాలా క్రేజ్ ఉంది. ఇక ప్రస్తుతం మాళవిక హీరో రామ్ తో కలిసి రెడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అంత పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడి గా ఉంది. ఈ సినిమాలో రామ్ రెండు పాత్రలు చేయబోతున్నారు. రెడ్ సినిమా తమిళ్ లో అరుణ్ విజయ్ హీరోగా వచ్చిన తడమ్ సినిమాకి రీమేక్. ఈ సినిమాని తెలుగులో కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ మీద స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రెడ్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది.