జిగేల్ మంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో సైంటిస్ట్‌ గా నటించిన నిధి అగర్వాల్‌ తన గ్లామర్ ఫోటోలతో దుమ్ము దులుపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్లలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఫ్యాషనబుల్‌ డ్రస్‌లలో గ్లామరస్‌గా ఫొటోలు దిగి పోస్ట్‌ చేస్తుంటారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో మతి పోగొట్టే ఫోటో పోస్ట్ చేసింది. వైట్ కలర్ టాప్, బ్లూ జీన్స్ లో కుర్చీ పై కూర్చుని ఫ్రోఫైల్ లుక్ ఇస్తూ ఉన్న ఈ ఫోటో నిధి అగర్వాల్ అభిమానులకు కనులవిందులా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నిధి అగర్వాల్‌ ఫోటో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లో  విపరీతమైన లైకులు, కామెంట్స్ వస్తున్నాయి. దిన్ని బట్టి నిధి అగర్వాల్ క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. నిధి అగర్వాల్ తెలుగులో ‘సవ్యసాచీ’ సినిమాలో నాగ చైతన్య సరసన నటించి తెలుగు తెరకు పరిచయమయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ హిట్ కొట్టి వీపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో తన అందంతో పాటు నటనకూ మంచి మార్కులు పడ్డాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నిధి అగర్వాల్ కి చాలా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి.  ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమాతో బీజీ షెడ్యూల్ గడుపుతూ ఉంది నిధి అగర్వాల్.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.