సొట్ట బుగ్గల సుందరి ‘అందాల రాక్షసి’ సినిమాతో పేరు తెచ్చుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఈ సొట్ట బుగ్గల సుందరికి నటనతో పాటు మంచి గ్లామర్ కూడా వుంది. ఈ రెండు తన కేరీర్ కి ప్లస్ అని చెప్పుకోవచ్చు. కానీ తనకు సరైన పాత్ర దొరకలేదనే చెప్పాలి. భలేభలే మగాడివోయి, సొగ్గాడె చిన్ని నాయన సినిమాలు తప్ప లావణ్యకి పెద్ద హిట్స్ లేవనే చెప్పాలి. తన స్టిల్స్ ను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. బబ్లీ అండ్ క్యూట్ గర్ల్ గా ఇమేజ్ తెచ్చుకున్న లావణ్యకు ఫుల్ ఫ్లెడ్జ్ గా గ్లామర్ డాల్ గా సరైన పాత్ర దొరకలేదు. అలాగే తను చిన్నప్పుడే నేర్చుకున్న భరత నాట్యంతో తను క్లాస్ పాత్రలు చెయ్యడానికి కూడా లావణ్య త్రిపాఠి సరిపోతుంది. తాజాగా జి.ఎ.2 సంస్థ కార్తికేయతో నిర్మిస్తున్న 'చావు కబురు చల్లగా' చిత్రంలోనూ, సందీప్ కిషన్ సరసన 'ఎ1 ఎక్స్ ప్రెస్'లోనూ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. అవకాశం చిక్కాలే కానీ గ్లామర్ ట్రీట్ చేయడానికీ తాను సిద్ధమంటోంది లావణ్య. తాజాగా లావణ్య త్రిపాఠి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏ1 ఎక్స్ప్రెస్ సినిమాలోని వర్కంగ్ స్టిల్ ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ ఈ సినిమా లోని పాత్రకి ఫర్ఫార్మ్ చెయ్యడం చాలా అమెజింగ్ గా వుందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు సందీప్ కిషన్ కి జోడీగా నటిస్తుంది లావణ్య త్రిపాఠి.