‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠికి ‘భలే భలే మగాడివోయ్’, సోగ్గాడే చిన్నినాయనా’, ‘మిస్టర్’, ‘అర్జున్ సురవరం’ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆమె ప్రస్తుతం తెలుగులో వరస సినిమాలతో బిజీగా ఉంది. అయితే లావణ్య తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తాను ఈ మద్యనే పాల్గొన్న ఫోటోషూట్ ఫొటోస్ ని పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ లో లెహంగా మరియు జ్యూవెలరీతో లావణ్య చాలా అందంగా కనిపించింది. తన డ్రెస్ ని ఇస్సా కంపెనీ డిజైన్ చేశారు. తనని అందంగా అక్షయ్ రావు ఫోటో తీశారు. ఇక లావణ్య ప్రస్తుతం చావు కాబురు చల్లగా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాని ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో, వరస విజయాలు అందుకుంటున్న బన్నీ వాసు నిర్మాణంలో నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన హీరో కార్తికేయ 'బస్తి బాలరాజు' ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ తరువాత విడుదలైన క్యారెక్టర్ వీడియోకి కూడా అనూహ్య స్పందన లభించింది. ఈ మధ్యనే లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కూడా ఈ మూవీ టీం విడుదల చేసింది.