

అందాల రాక్షసితో పేరు తెచ్చుకున్న హిరోయిన్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠికి నటనతో మంచి పేరు వచ్చిన తొలి విజయం మాత్రం 'భలే భలే మగాడివోయ్'తో లభించింది. ఆ తర్వాత నాగార్జున సరసన నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం లావణ్య ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. తన స్టిల్స్ ను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. బబ్లీ అండ్ క్యూట్ గర్ల్ ఇమేజ్ తెచ్చుకున్న లావణ్యకు ఫుల్ ఫ్లెడ్జ్ గ్లామర్ పాత్ర దొరకలేదు. అలాగే తను చిన్నప్పుడే నేర్చుకున్న భరత నాట్యంతో క్లాస్ పాత్రలు చెయ్యడానికి కూడా లావణ్య త్రిపాఠి సరిపతుంది. తాజాగా జి.ఎ.2 సంస్థ కార్తికేయతో నిర్మిస్తున్న 'చావు కబురు చల్లగా' చిత్రంలోనూ, సందీప్ కిషన్ సరసన 'ఎ1 ఎక్స్ ప్రెస్'లోనూ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. అవకాశం చిక్కాలే కానీ గ్లామర్ ట్రీట్ చేయడానికీ తాను సిద్ధమంటున్న లావణ్య, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో కొత్త లుక్స్ తో ఫోటోలు షేర్ చేసింది ఈ ఫోటోల్లో లావణ్య ట్రేడిషినల్ లుక్స్ తో జ్యూవెలరీ వేసుకుని తళుక్కున మెరిసింది. 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్న లావణ్య త్రిపాఠి మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం