లావణ్య త్రిపాఠి తన కెరీర్ ను సాఫీగా ముందుకు తీసుకెళుతోంది. అయితే వరస విజయాలతో
టాప్ రేంజ్ కు వెళ్ళాలని కోరుకుంటోంది ఈ అమ్మడు. సందీప్ కిషన్ సరసన ఏ1 ఎక్స్ ప్రెస్ లో
నటించింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇక మరికొన్ని ప్రాజెక్టులను లావణ్య లైన్లో
పెడుతోంది. డిసెంబర్ 15న లావణ్య తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెల్సిందే. ఈ
పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా జరుపుకుంది ఈ భామ. ఇక తన బర్త్ డేను స్పెషల్ గా చేసిన అందరికీ
థాంక్స్ చెబుతోంది ఈ అమ్మడు. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో తన పుట్టినరోజుకు సంబంధించి లాంగ్
మెసేజ్ ను షేర్ చేసింది. "మీ విషెస్ కు చాలా ప్రత్యేకంగా ఫీలవుతున్నా. నేను ఎక్కడి నుండి వచ్చాను, ఏ
స్థాయికి చేరుకున్నాను అనే విషయంలో చాలా ఆనందిస్తాను. ప్రతీ సంవత్సరం దాని ముందు సంవత్సరం
కన్నా బాగుంటుంది. ఎందుకంటే అది ప్రతిరోజూ బాగుంటుందని కాదు, ప్రతీ రోజూ ఏదొక మంచి
ఉంటుంది. మనం ప్రపంచాన్ని చూసే విధానం మార్చుకోవాలంతే" అని లావణ్య తన పుట్టినరోజు పిక్చర్స్
తో కలిపి ఒక పోస్ట్ పెట్టింది.